90 శాతం కొత్త కేసులు.. అమెరికాలో కొత్త వేరియంట్ కలకలం

90 శాతం కొత్త కేసులు.. అమెరికాలో కొత్త వేరియంట్ కలకలం

అమెరికాలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ బీబీ.1.5  విరుచుకుపడుతోంది. ప్రస్తుతం నమోదవుతున్న కొత్త కేసుల్లో 90 శాతం ఈ వేరింయంట్ బారిన పడిన వాళ్లే ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అమెరికా అంతటా హై అలర్ట్ ప్రకటించారు. ఎక్స్ బీబీ.1.5 వైరస్ వృద్ధిరేటు గత సంవత్సరం చివరి నుండి పెరుగుతూనే ఉంది. కేవలం ఈ వారంలోనే కొత్తగా 89.2 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, ప్రాణాపాయం మాత్రం 1 శాతానికి పడిపోయిందని అమెరికా ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే, వారాలు గడిచేకొద్దీ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, భయపడాల్సిన పనిలేదని తెలిపింది.