బ్లాక్ ఫంగస్ మందులు అయిపోతుంటే ఏం చేస్తున్నారు?

బ్లాక్ ఫంగస్ మందులు అయిపోతుంటే ఏం చేస్తున్నారు?

న్యూఢిల్లీ: దేశంలో బ్లాక్ ఫంగ‌స్‌ కేసులు పెరగడంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. బ్లాక్ ఫంగస్‌ను ఎదుర్కోవడంలో కేంద్ర విధానమేంటో స్పష్టం చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. బ్లాక్ ఫంగస్ ట్రీట్‌మెంట్‌లో వాడే డ్రగ్స్ (ఔషధాలు) నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తోందంటూ మండిపడ్డారు. మోడీ సర్కార్‌‌కు రాహుల్ మూడు ప్రశ్నలు సంధించారు. ‘బ్లాక్ ఫంగస్ చికిత్సలో కీలకమైన Amphotericin B మందు నిల్వలు తక్కువగా ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది? రోగులకు ఈ మందులను ఇచ్చేందుకు కేంద్రం ఏ ప్రక్రియను అమలు చేస్తోంది? పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇచ్చే బదులు వారిని మోడీ సర్కార్ మరింత కష్టాల్లోకి నెడుతోంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు.