
- భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ముషీరాబాద్ అధ్యక్షుడు వినయ్ కుమార్
ముషీరాబాద్, వెలుగు: వినాయక చవితి సందర్భంగా సిటీలో గణేశ్ మండపాలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులపై పోలీస్ శాఖ ఎలాంటి ఒత్తిడి చేయొద్దని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ముషీరాబాద్ అధ్యక్షుడు వినయ్ కుమార్ కోరారు. ఈ నెల 10న వినాయక చవితి,- 19న నిమజ్జనం సందర్భంగా.. భాగ్య నగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మంగళవారం బండమైసమ్మ నగర్ కమ్యూనిటీ హాల్ లో మీడియా సమావేశం నిర్వహించారు. వినయ్ కుమార్ మాట్లాడుతూ.. మండపాల ఏర్పాటు, విగ్రహాల ఎత్తుపై నిర్వాహకులను ఎలాంటి ఇబ్బందికి గురిచేయొద్దన్నారు. విద్యుత్ అధికారులు కూడా ఎలాంటి చార్జీలు వసూలు చేయొద్దన్నారు. నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నం. 77998 19991 కు కంప్లయింట్ చేయొచ్చన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుడు శక్తి సింగ్, ముషీరాబాద్ నియోజకవర్గం సభ్యులు పరిమల్,వెంకటేష్, మహేందర్ పాల్గొన్నారు.