
శ్రీశైలానికి వరద కొనసాగుతోంది. వేగంగా డ్యామ్ నీటి మట్టం పెరుగుతోంది.. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 854.70 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టిఎంసిలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 89 టిఎంసిలు ఉంది. శ్రీశైలానికి ఇన్ ఫ్లో 2 లక్షల 20 వేల క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్ ఫ్లో నిల్ గా ఉంది. (2400 క్యూసెక్కులు కల్వకుర్తి పథకానికి మాత్రమే విడుదల) ఈ సంవత్సరం వర్షాలు ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు జూరాల నుండి శ్రీశైలం డ్యామ్ కు 73 టీఎంసీల వరద నీరు వచ్చింది.