వందకు 30మందిలో ఊపిరితిత్తుల సమస్య

వందకు 30మందిలో ఊపిరితిత్తుల సమస్య

 

  • నిమ్స్‌‌‌‌ పల్మనాలజీ డిపార్ట్​మెంట్​ హెచ్​వోడీ ప్రొఫెసర్ పరంజ్యోతి 

పంజాగుట్ట, వెలుగు : అప్రమత్తతతోనే ఊపిరితిత్తులు సురక్షితంగా ఉంటాయని నిమ్స్‌‌‌‌ ఆస్పత్రి పల్మనాలజీ డిపార్ట్​మెంట్​ హెచ్​వోడీ  ప్రొఫెసర్ పరంజ్యోతి పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) డే సందర్భంగా బుధవారం ఆస్పత్రి ఎమర్జెన్సీ వింగ్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గాలి కాలుష్యం, దుమ్ము కారణంగా ఎంతోమంది  ఊపిరితిత్తుల సమస్యలతో  బాధపడుతున్నారన్నారు.  గతంలో వృద్ధుల్లో  ఈ సమస్య ఎక్కువ ఉండేదని,  ప్రస్తుతం35  ఏళ్ల నుంచి 40  ఏళ్ల వారిలోనూ సమస్య పెరుగుతుందన్నారు.  

ప్రతి100 మందిలో 30 శాతం వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. స్మోకింగ్‌‌‌‌కు దూరంగా ఉండాలని, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, కలుషిత వాయువులకు  దూరంగా ఉండాలన్నారు.  ముఖ్యంగా మాస్క్  ధరించడం ఉపయోగకరమన్నారు.  కార్యక్రమంలో ఇన్​చార్జి  డీన్  నాగేశ్వరావు, అసోసియేట్ డీన్ సాయిబాబా, ప్రొఫెసర్ పద్మజ, డాక్టర్లు పాల్గొన్నారు.