
ఆదుకోవాలని మంత్రి తలసానిని వేడుకున్న మహిళ
పద్మారావునగర్, వెలుగు : ఇటీవల షార్ట్‌సర్క్యూట్‌తో తన ఇల్లు పూర్తిగా తగలబడిందని, బిడ్డ పెండ్లి కోసం దాచిన డబ్బు, పెండ్లి బట్టలు మంటల్లో కాలిపోయాయని బన్సీలాల్ పేట డివిజన్ సి క్లాస్ ఏరియాకు చెందిన మీనా వాపోయింది. తమను ఆదుకోవాలని ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిసి వేడుకుంది. వెస్ట్ మారేడ్ పల్లిలోని ఇంట్లో మంత్రిని కలసి మొరపెట్టుకుంది. నెల రోజుల్లో పెండ్లి ఉందని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని ఏడుస్తూ వివరించింది. ఆల్మారాలో దాచిన రూ.లక్షా20 వేలు, పెండ్లి బట్టలు, టీవీ, నిత్యావసరాలు అన్నీ కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన మంత్రి రెవెన్యూ అధికారులతో మాట్లాడి, ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు డివిజన్ లీడర్ జ్ఞాని తెలిపారు.
ఆసరా పెన్షన్ విడుదల చేయాలి
సికింద్రాబాద్: మూడు నెలలుగా ఆసరా పెన్షన్లు అందడం లేదని, వెంటనే మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు నాగేశ్వర్కోరారు. ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి విన్నవించారు. పెన్షన్అందక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మంత్రిని కలిసిన వారిలో వేదిక నాయకులు శ్రీనివాస్, శివరాత్రి రాజయ్య, మహంకాళి రవీందర్ తదితరులు ఉన్నారు.