రూరల్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో అశ్వధామ మూవీ

రూరల్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో అశ్వధామ మూవీ

హృతిక్ శౌర్య హీరోగా వరలక్ష్మీ శరత్‌‌కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘అశ్వధామ’. హతః అక్షర అనేది ట్యాగ్‌‌లైన్.  చంద్ర శేఖర్‌‌ ఆజాద్‌‌ పాటిబండ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  ఫ్లిక్‌‌నైన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. మంగళవారం హృతిక్ పుట్టినరోజు సందర్భంగా మూవీ ఫస్ట్‌‌ లుక్‌‌ పోస్టర్‌‌ను విడుదల చేశారు మేకర్స్.  ‘ఓటు’  చిత్రంతో హీరోగా కెరీర్‌‌ ప్రారంభించిన హృతిక్ శౌర్య..  అందులో సాఫ్ట్‌‌ కుర్రాడిగా కనిపించగా, ఇందులో  మాస్  హీరోగా కనిపించనున్నాడు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘రూరల్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో సాగే లవ్‌‌, క్రైమ్‌‌ థ్రిల్లర్‌‌ ఇది.  కమర్షియల్‌‌ అంశాలతో తెరకెక్కుతోంది. వరలక్ష్మీ శరత్ కుమార్‌‌ పాత్ర గత చిత్రాలకు భిన్నంగా  ఉంటుంది. నెగెటివ్‌‌ షేడ్ ఉన్న పాత్రలో ఒక సర్‌‌ప్రైజ్‌‌ ఆర్టిస్ట్‌‌ కనిపిస్తారు. ఇప్పటి వరకూ జరిగిన రెండు షెడ్యూళ్లలో కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్ సీన్స్  చిత్రీకరించాం’ అని చెప్పాడు.