
నటుడు మోహన్ బాబు మరోసారి మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. షాద్ నగర్లో కవరేజ్ కు వచ్చిన మీడియాపై సిగ్గులేదా అంటూ తన నోటికి పనిచెప్పారు. రిజిస్ట్రేషన్ విషయంలో మోహన్ బాబు షాద్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. మోహన్ బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కవరేజ్ కు వెళ్లగా లోగోలు లాక్కొండయ్యా అంటూ బౌన్సర్లకు సూచించారు. బుద్ధి లేదా అంటూ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆస్తికి సంబంధించి వీలునామా కోసం మోహన్ బాబు షాద్ నగర్ వచ్చినట్లు తెలుస్తోంది
ఇటీవల మంచు విష్ణు, మనోజ్ వివాదంలో కూడా మోహన్ బాబు మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. ఓ కార్యక్రమంలో వివాదం గురించి స్పందించాలని మోహన్ బాబును మీడియా ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా.. మీ ఇంట్లో నీ భార్యకు నీకు ఉన్న సంబంధం ఏంటో చెప్పగలవా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఎప్పుడు ఏది అడగాలో తెలుసుకోవాలన్నారు. మీడియా మిత్రులంటే తనకు చాలా ఇష్టమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇదే కార్యక్రమంలో మంచు విష్ణుతో జరిగిన గొడవలపై ప్రశ్నించిన మీడియాపై మంచు మనోజ్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ ఇష్యూస్ పై స్పందించాలని రిపోర్టర్లు అడగ్గా.. భుజంపై సెగ్గడ్డ వచ్చింది గోకుతారా? అదే రీసెంట్ ఇష్యూ అని సెటైర్లు వేశారు. దీంతో మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.