ప్రజలకు వ్యాక్సిన్‌ను ప్రభుత్వమే అందిస్తుంది

ప్రజలకు వ్యాక్సిన్‌ను ప్రభుత్వమే అందిస్తుంది

సీరం ఇన్‌స్టిట్యూట్‌
పూణే: కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) పురోగతిలో ఉన్న సంగతి తెలిసిందే. ఎస్‌ఐఐ తాజాగా వ్యాక్సిన్ పంపిణీ గురించి స్పందించింది. కరోనా వ్యాక్సిన్‌ను ప్రైవేటు ఎంటిటీస్‌కు ఇవ్వడం కంటే గవర్నమెంట్ నెట్‌వర్క్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయించడమే మేలని వ్యాఖ్యానించింది. ప్రపంచంలో భారీ స్థాయిలో పలు వ్యాధులకు వ్యాక్సిన్‌లను అందించిన కంపెనీగా సీరం ఇన్‌స్టిట్యూట్‌కు మంచి పేరుంది. పూణేలో తాను ఉంటున్న పార్సీ కమ్యూనిటీకి సరిపడే కంటే భారీ మొత్తంలో కరోనా వ్యాక్సిన్‌ డోసులను తమ కంపెనీ సిద్ధం చేస్తోందని సీరం సీఈఓ అదర్ పూనవల్లా ట్వీట్ చేశారు.

‘ఇద్దరు పార్సీల మధ్య జరిగిన సాధారణ సంభాషణ అది. ఒక్కసారి వ్యాక్సిన్‌ డెవలప్‌మెంట్ పూర్తయితే అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు దీని గురించి మాట్లాడటం కాస్త తొందరపాటు అవుతుంది. పంపిణీ విషయంలో వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతమైతే ప్రభుత్వమే ప్రజలందరికీ దీన్ని అందిస్తుంది. వ్యాక్సిన్‌ను నేరుగా కొనాల్సిన అవసరం ఉండదు’ అని ఎస్‌ఐఐ లిఖిత పూర్వక స్టేట్‌మెంట్‌లో తెలిపింది. కరోనా వ్యాక్సిన్ సిద్ధమైతే దాని తయారు చేయడానికి ఆక్స్‌ఫర్డ్‌తోపాటు దాని పార్ట్‌నర్‌‌ అయిన ఆస్ట్రాజెనెకా సంస్థలు ఎస్‌ఐఐని ఎంపిక చేశాయి.