రోజూ కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

రోజూ కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
  • కోవిన్ పోర్టల్, యాప్​ను అప్​గ్రేడ్ చేస్తోన్న కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో కేంద్రం వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేసే అంశంపై దృష్టి పెట్టింది. 45 ఏండ్లు పైబడినోళ్లకు  వ్యాక్సిన్ అందజేస్తామని ప్రకటించింది. రోజుకు కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకునేలా కోవిన్ పోర్టల్, యాప్​ను అప్​గ్రేడ్ చేయనుంది. ఏప్రిల్ 1 నుంచి ఇది అందుబాటులోకి వస్తుందని కొవిడ్ వ్యాక్సినేషన్ ఎంపవర్డ్ గ్రూప్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఆదివారం తెలిపారు. రోజుకు రికార్డు స్థాయిలో 50 లక్షల మందికి టీకా వేసేలా ప్లాన్ చేశామన్నారు. ‘‘వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దానికి తగ్గట్టుగా సిస్టమ్ ను అప్ గ్రేడ్ చేస్తున్నాం’’ అని తెలిపారు. రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, మేనేజ్ మెంట్, సర్టిఫికెట్ జనరేషన్ ఇలా నాలుగు లెవెల్స్ లో కొవిన్ పోర్టల్ పని చేస్తోందన్నారు. ప్రజల ప్రైవసీని కాపాడుతూ.. పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ సిస్టమ్ పని చేస్తోందని చెప్పారు. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో తప్పులు దొర్లుతున్నాయన్న రిపోర్టులను ఆయన అంగీకరించారు. సెల్ఫ్ రిజిస్ట్రేషన్, స్పాట్ రిజిస్ట్రేషన్ సమయంలో పేరు, జెండర్, పుట్టిన సంవత్సరం లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అడుగుతున్నామని, లబ్ధిదారులు సరైన సమాచారం ఇవ్వాలన్నారు.