వీడియో: కరోనాను తేలిగ్గా తీసుకోవద్దు.. ఓ డాక్టర్ చివరి మెసేజ్

వీడియో: కరోనాను తేలిగ్గా తీసుకోవద్దు.. ఓ డాక్టర్ చివరి మెసేజ్
  • వైరస్​పై పోరాడుతూ ఆస్పత్రిలో కన్నుమూత
  • వీడియోను సోషల్​ మీడియాలో పంచుకున్న భర్త

న్యూఢిల్లీ: ‘కరోనాను తేలిగ్గా తీసుకోవద్దు.. మీ కోసం, మీరు ప్రేమించే వాళ్ల సేఫ్టీ కోసం బయటకు వెళ్లిన ప్రతిసారీ మాస్క్​ తప్పకుండా పెట్టుకోండి’.. ఆస్పత్రి బెడ్​ మీది నుంచి అతికష్టమ్మీద ఓ లేడీ డాక్టర్ వీడియో మెసేజ్​ఇది. అప్పటికే ఆమె ప్రెగ్నెంట్.. కడుపులో బిడ్డ చనిపోతే డాక్టర్లు ఆపరేషన్​ చేశారు. ఆ మరుసటి రోజు కరోనా ఆ డాక్టర్​ను బలితీసుకుంది. గత నెలలో ఢిల్లీలో ఈ విషాదం చోటుచేసుకుంది. చనిపోయిన ఆ డాక్టర్​ పేరు డింపుల్ అరోరా చావ్లా.ఆమెకు భర్త, మూడేళ్ల బాబు ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్. ఏప్రిల్ 10న కరోనా పాజిటివ్​గా తేలడంతో డింపుల్​ ఆస్పత్రిలో చేరారు. ఏప్రిల్​17న బెడ్​ మీది నుంచే ఈ వీడియో తీసి భర్త , బంధువులు, ఫ్రెండ్స్​కు పంపించారు. అందరినీ హెచ్చరించారు. తర్వాత నాలుగు రోజులకు డింపుల్​ ఆక్సిజన్​ లెవెల్స్ పడిపోవడం మొదలైంది. డాక్టర్లు రెండు సార్లు ప్లాస్మా థెరపీ కూడా చేశారు.. అయినా ఉపయోగం లేకుండా పోయింది. 25 న డాక్టర్లు సిజేరియన్​ చేసి మృత శిశువును బయటకు తీశారు. కరోనా వైరస్​ వల్ల ఇబ్బందులకు తోడు బిడ్డ చనిపోవడంతో డింపుల్​ తట్టుకోలేకపోయారు. ఆ మరుసటి రోజే కన్నుమూశారు. భార్య చివరి కోరిక, జనంలో అవగాహన కోసం డింపుల్​ భర్త రావీశ్ ఈ వీడియో మెసేజ్​ను సోషల్​ మీడియాలో అప్​లోడ్​ చేశారు.