KKR vs RCB: ఒంటి చేత్తో పట్టేశాడు: ఐపీఎల్‌లో గ్రీన్ స్టన్నింగ్ క్యాచ్

KKR vs RCB: ఒంటి చేత్తో పట్టేశాడు: ఐపీఎల్‌లో గ్రీన్ స్టన్నింగ్ క్యాచ్

ఐపీఎల్ లో మరో స్టన్నింగ్ క్యాచ్ నమోదయింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు కామెరూన్ గ్రీన్ సూపర్ క్యాచ్ తో మెరిశాడు. యష్ దయాళ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రఘు వంశీ మిడాన్ దిశగా ఫ్లిక్ షాట్ ఆడాడు. బంతిని 30 యార్డ్ సర్కిల్ దాటిద్దామనుకున్న రఘువంశీ.. టైమింగ్  సరిగా కుదరకపోవడంతో దగ్గరలోనే గాల్లోకి లేచింది. మిడ్ వికెట్ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న గ్రీన్ ఈ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. 

వెనక్కి వెళ్తూ గాల్లోకి ఎగిరి ఒంటి చెత్తతో బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో వెనక్కి డైవ్ చేసినా తనను తాను నియంత్రించుకున్న విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ క్యాచ్ ఏ సీజన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్న కోల్ కతా నైట్ రైడర్స్ 15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఓపెనర్ సాల్ట్ 14 బంతుల్లోనే 48 పరుగులు చేసాడు.