విరాట్ కోహ్లీపై ఒక మ్యచ్ నిషేధం.. డుప్లెసిస్కు హెచ్చరిక

విరాట్ కోహ్లీపై ఒక మ్యచ్ నిషేధం.. డుప్లెసిస్కు హెచ్చరిక

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వరుస షాక్ లు తగులుతున్నాయి. గాయాల కారణంగా ఇప్పటికే టాప్ ప్లేయర్లు దూరం కాగా.. గాడిన పడుతున్న జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. స్టాండ్ బై కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ లేదా కెప్టెన్ డుప్లెసిస్ పై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది.

గత రెండు మ్యాచుల్లో బెంగళూరు కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా.. విరాట్ కోహ్లీకి రూ.24 లక్షల ఫైన్ విధించాడు మ్యాచ్ రిఫరీ.

అయితే, డుప్లెసిస్ పై ఇప్పటికే ఓసారి ఫైన్ పడింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఏ జట్టైనా రెండు కంటే ఎక్కువ సార్లు స్లో ఓవర్ రేట్ రిపీట్ చేస్తే కెప్టెన్ పై ఒక మ్యాచ్ నిషేధం విదిస్తారు. అయితే, తర్వాతి మ్యాచ్ లో ఆర్సీబీ ఇదే రిపీట్ చేస్తే స్టాండ్ ఇన్ కెప్టెన్ గా ఉన్న కోహ్లీపై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది. లేదా డుప్లిసెస్ కెప్టెన్సీ చేసినా ఆ నిషేధం అతనికి కూడా వర్తిస్తుంది.