SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు మరో అవకాశం

SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు మరో అవకాశం

ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు మరో అవకాశం కల్పించింది తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. టెస్టులు నిర్వహించే సమయంలో కుల ధ్రువీకరణ పత్రాలు చూపించని వాళ్లు ఈ నెల 28, 29 తేదిల్లో హైదరాబాద్ అంబర్ పేట లోని పోలీస్ క్వార్టర్స్ లో సర్టిఫికెట్లు అందించాలని సూచించింది. 99.9  శాతం పర్ఫార్మెన్స్ జాబితా రెడీ అయ్యిందని….0.1 శాతం మాత్రమే సాంకేతికపరమైన సమస్యతో పెండింగ్ లో ఉన్నాయని చెప్తున్నారు అధికారులు. వాటిని కూడా త్వరలోనే క్లియర్ చేసి…తుది పరీక్షల షెడ్యూలు విడుదల చేస్తామని చెప్తున్నారు.

ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు తుది పరీక్షలు నిర్వహించేందుకు స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు రెడీ అవుతోంది.అయితే ఫిజికల్ మెజర్ మెంట్ , ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులతో పాటు కొన్ని సాంకేతిక సమస్యలు రావడంతో వాటిని క్లియర్ చేసే పనిలో పండింది రిక్రూట్ మెంట్ బోర్డు. తుది పరీక్షకు సంబంధించి 99.9 శాతం 2 లక్షల 17 వేల 361 మంది పర్ఫార్మెన్స్ షీట్స్ రెడీ చేశారు అధికారులు. 0.1 శాతం మాత్రమే సాంకేతిక సమస్యతో పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరలోనే క్లియర్ చేస్తామంటున్నారు.

ఫిజికల్ టెస్టుల సమయంలో కుల ధృవీకరణ పత్రాలు చూపించని అభ్యర్థులు… ఈ నెల 28,29 తేదీల్లో  హైదరాబాద్ అంబర్ పేటలోని పోలీస్ క్వార్టర్స్ లో సర్టిఫికెట్స్ సమర్పించాలని సూచించింది స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తుల సమయంలో అభ్యర్థులు కొన్ని కాలమ్స్ ను తప్పుగా ఫిల్ చేసినట్లు గుర్తించారు అధికారులు. వారికి రిక్రూట్ మెంట్ బోర్డు మరో అవకాశం కల్పించింది. తప్పులను సరిచేసుకునేందుకు వెబ్ సైట్ లో ఎడిట్ ఆప్షన్ ను ఏర్పాటు చేసింది.  కాలమ్స్ లో తప్పుగా ఫిల్ చేసిన అభ్యర్థులు సరి చేసుకోవాలని సూచించింది.

మరోవైపు  ఫైనల్ ఎగ్జామ్ కు రెడీ అవుతున్న అభ్యర్థులను అప్రమత్తం చేసింది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. అడ్డదారుల్లో ఉద్యోగాలిప్పిస్తామనే వారిని నమ్మవద్దని సూచించింది. తుది పరీక్షలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని తెలిపింది. ఎవరైనా ఉద్యోగాలిప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తే పోలీసులకు ఫిర్యాదుచేయాలని చెప్పింది..