ఫ్యాన్స్కు మహేష్ బర్త్ డే గిఫ్ట్.. గుంటూరు కారం నుండి ఊరమాస్ లుక్

ఫ్యాన్స్కు మహేష్ బర్త్ డే గిఫ్ట్.. గుంటూరు కారం నుండి ఊరమాస్ లుక్

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur kaaram). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ కు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.  ఇక మహేష్ బాబు కూడా ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించనంత మాస్ లుక్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. 

ఇక తాజాగా ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సంధర్బంగా గుంటూరు కారం నుండి మరో మాస్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో మహేష్ లుంగీ కట్టుకొని, నోట్లో బీడీతో మాస్ మూలవిరాట్ లా కనిపిస్తన్నారు. ఇక ఈ పోస్టర్ లో మరోసారి గుంటూరు కారం రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశారు. ముందుగా అనుకున్నట్టుగానే ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో  గుంటూరు కారం రిలీజ్ పోస్ట్ పోన్ అవనుంది అంటూ వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ పండగా చేసుకుంటున్నారు.

ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే.. లేటెస్ట్ బ్యూటీస్ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గ నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్ పై చినబాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.