హెల్దీ డ్రింక్స్

హెల్దీ డ్రింక్స్

బయట ఎండకు, ఒంట్లో వేడికి ఒకటే సొల్యూషన్​. చల్లగా ఏదైనా కూల్ డ్రింక్​​ తాగితే హాయిగా అనిపిస్తుంది. అదే కొంచెం హెల్దీగా తాగాలంటే.. ఇవి ట్రై చేయాల్సిందే. లస్సీ నుంచి షర్బత్, మోజిటో, మాక్​ టైల్​ వరకు అన్నీ హెల్దీ కూల్​ డ్రింక్​లే. మరింకెందుకాలస్యం వెంటనే వీటిని ట్రై చేసి, టేస్ట్​ చేయండి. 

హెల్దీ డ్రింక్స్ ; పైనాపిల్ మాక్​టైల్
కావాల్సినవి :పైనాపిల్ ముక్కలు – ఒక కప్పుఆరెంజ్ జ్యూస్ – రెండు టేబుల్ స్పూన్లునీళ్లు – పావు కప్పుచక్కెర – ఒకటిన్నర టేబుల్ స్పూన్
తయారీ :మిక్సీజార్​లో పైనాపిల్ ముక్కలు వేసి, ఆరెంజ్ జ్యూస్, నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి.  ఆ మిశ్రమాన్ని వడకట్టి, చక్కెర వేసి కలపాలి. ఒక గ్లాస్​లో ఐస్​క్యూబ్స్, పైనాపిల్ ముక్కలు, పుదీనా ఆకులు వేయాలి. పైనాపిల్ మిశ్రమం కూడా అందులో పోసి బాగా కలపాలి. 

హెల్దీ డ్రింక్స్ ; నిమ్మ–పుదీనా షర్బత్
కావాల్సినవి : పుదీనా ఆకులు – ఒక కప్పునిమ్మకాయలు – రెండుచక్కెర – రెండు టేబుల్ స్పూన్లునీళ్లు – ఒకటిన్నర కప్పుఐస్​క్యూబ్స్ – కొన్ని
తయారీ :మిక్సీ జార్​లో నిమ్మరసం, చక్కెర, పుదీనా ఆకులు, ఐస్​క్యూబ్స్ వేసి, నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని వడకట్టాలి. ఒక గ్లాస్​లో ఐస్​క్యూబ్స్ వేసి, ఈ మిశ్రమాన్ని పోయాలి. అంతే... పుదీనా సువాసనతో అదిరిపోయే సమ్మర్​ రిఫ్రెషింగ్​ షర్బత్ రెడీ. 

హెల్దీ డ్రింక్స్ ; మొసాంబి మోజిటో
కావాల్సినవి : బత్తాయి పండ్లు – మూడుచక్కెర – రెండు టీస్పూన్లుఉప్పు – సరిపడానిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్ఐస్​క్యూబ్స్ – ఆరుపుదీనా ఆకులు – పది      నీళ్లు – పావు కప్పు
తయారీ : బత్తాయి పండ్లు ఒలిచి, తొక్క తీయాలి. వాటి తొనల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత అందులో చక్కెర, ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. ఒక గ్లాసులో ఐస్​క్యూబ్స్, పుదీనా ఆకులు వేయాలి. ముందుగా రెడీ చేసిన బత్తాయి పండ్ల మిశ్రమం కూడా దాంట్లో పోయాలి. చివరిగా నిమ్మకాయ గుజ్జు కూడా కలిపితే తాగేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. 

హెల్దీ డ్రింక్స్ ; డ్రైఫ్రూట్​ సమ్మర్ డ్రింక్
కావాల్సినవి :బాదం, ఎండుద్రాక్ష, జీడిపప్పులు (నానబెట్టిన) – ఒక్కోటి నాలుగు చొప్పునపెరుగు – ఒకటిన్నర కప్పుఫుడ్ కలర్ – కొంచెంచక్కెర పొడి – రెండున్నర టేబుల్ స్పూన్లునీళ్లు, ఐస్ క్యూబ్స్ – సరిపడాయాలకుల పొడి – ఒక టీస్పూన్
తయారీ : ఒక మిక్సీ జార్​లో పెరుగు, బాదం, ఎండుద్రాక్ష, జీడిపప్పులు, ఫుడ్​ కలర్, యాలకుల పొడి వేసి, నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఒక గ్లాస్​లో ఐస్​ క్యూబ్స్ వేసి అందులో ఈ మిశ్రమాన్ని పోయాలి. కొంచెం పెరుగుని బాగా గిలక్కొట్టి క్రీమ్​ చేయాలి. దాన్ని లస్సీపై వేసి, డ్రైఫ్రూట్స్​ తరుగు చల్లుకుంటే డ్రైఫ్రూట్ డ్రింక్ రెడీ.

హెల్దీ డ్రింక్స్ ; స్ట్రాబెర్రీ లస్సీ
కావాల్సినవి   :  స్ట్రాబెర్రీ తరుగు – రెండు కప్పులు, పెరుగు – ఒక కప్పుపాలు – అర కప్పు, చక్కెర – రెండు టేబుల్ స్పూన్లు
 తయారీ          :  మిక్సీ జార్​లో స్ట్రాబెర్రీ తరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత పెరుగు, పాలు, చక్కెర ఒక్కోటిగా వేస్తూ మిక్సీ పట్టాలి. ఆ మిశ్రమాన్ని గ్లాసులో పోసుకుని, ఐస్​ ముక్కలు వేసుకుని తాగితే భలే ఉంటుంది స్ట్రాబెర్రీ లస్సీ.

హెల్దీ డ్రింక్స్ ; మ్యాంగో ఫలూదా
కావాల్సినవి  : మామిడి పండ్లు – రెండుచక్కెర – రెండు టేబుల్ స్పూన్లు, సబ్జా గింజలు – ఒక టేబుల్ స్పూన్ఫలూదా సేవ్ – ఒక టీస్పూన్పాలు – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ : సబ్జా గింజల్ని నానబెట్టాలి. మామిడి పండ్ల తొక్క తీసి, గుజ్జును మిక్సీజార్​లో వేయాలి. దాంతోపాటు చక్కెర కూడా వేసి గ్రైండ్ చేయాలి. ఒక గ్లాస్​లో మామిడి పండు మిశ్రమం, నానబెట్టిన సబ్జా గింజలు, ఫలూదా సేవ్ వేయాలి. ఆపై మామిడి పండు ముక్కలు వేసి, పాలు పోయాలి. ఆ తర్వాత అదే విధంగా మళ్లీ ఒక్కోటి లేయర్​లాగ వేయాలి.