యాక్సిడెంట్లతోనే మూడో వంతు మరణాలు:  సిటీ ట్రాఫిక్ చీఫ్​ సుధీర్​బాబు

యాక్సిడెంట్లతోనే మూడో వంతు మరణాలు:   సిటీ ట్రాఫిక్ చీఫ్​ సుధీర్​బాబు

సికింద్రాబాద్, వెలుగు: దేశంలో మూడో వంతు మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లనే జరుగుతున్నాయని, వీరిలో యువతే ఎక్కువగా ఉంటున్నారని సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై యువతలో అవగాహన కలిగించాలని ఆయన సూచించారు. శుక్రవారం బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్​లో ఎన్‌‌‌‌సీసీ క్యాడెట్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ఓవర్ స్పీడ్, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. సెల్ ఫోన్, రాంగ్ రూట్ డ్రైవింగ్ కారణంగా యువత ఎక్కువగా యాక్సిడెంట్లకు గురవుతున్నట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ చేయాలన్నారు. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్​ఏసీపీ శంకర్​రాజు ఎన్‌‌‌‌సీసీ క్యాడెట్లకు హెల్మెట్లు అందజేశారు. అడిషనల్ డీసీపీ రంగారావు, ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌  నాగరాజు, పాల్గొన్నారు.