ఒక్క చెట్టు 150 మందిని కాపాడింది.. వరదల సమయంలో ప్రాణధాత్రిగా నిలిచిన చింతచెట్టు

ఒక్క చెట్టు 150 మందిని కాపాడింది.. వరదల సమయంలో ప్రాణధాత్రిగా నిలిచిన చింతచెట్టు

బషీర్​బాగ్, వెలుగు: 1908లో మూసీలో వరదలు వచ్చిన సమయంలో చింతచెట్టు 150 మంది ప్రాణాలను కాపాడిందని, ఆ స్మృతులు ఐఖ్యతకు చిహ్నంగా చారిత్రాత్మకంగా నిలిచిపోతాయని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ అధ్యక్షుడు వేదకుమార్ మణికొండ అన్నారు. గురువారం ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్, పౌర సమాజ సంస్థల సహకారంతో అప్జల్ గంజ్‎లోని ఉస్మానియా హాస్పిటల్ ఆవరణలోని చింతచెట్టు ప్రాణధాత్రి వద్ద వార్షిక జ్ఞాపక- ఐక్యత సభను నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల సమయంలో 150 మందికి ప్రాణం పోసిన ఈ చెట్టును స్మరించుకోవడం గొప్ప విషయమన్నారు. 2008లో ప్రారంభమైన జ్ఞాపక సభ, ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పండిట్​పరాశర్, కవి సంఘమిత్ర, ప్రముఖ సినీ దర్శకురాలు అఫ్సాన్, ప్రసిద్ధ సాహితీ వేత్త అంబటి వెంకన్న, బ్రదర్ వర్గీస్, మానవ హక్కుల కార్యకర్త జీవన్​కుమార్, ఉస్మానియా ఆర్ఎంవో -1 డాక్టర్ జయక్రిష్ణ పాల్గొన్నారు.