ఒప్పోతో వన్‌‌ప్లస్ విలీనం

ఒప్పోతో వన్‌‌ప్లస్ విలీనం

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్‌‌ప్లస్ కీలక నిర్ణయం తీసుకుంది. సోదర సంస్థ అయిన ఒప్పోతో తాను కలుస్తున్నట్లు వన్‌‌ప్లస్ ప్రకటించింది. ఇరు సంస్థల రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్ టీమ్స్ కలసి పని చేయడంతో మంచి ఫలితాలు వచ్చినందున.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వన్‌‌ప్లస్ తెలిపింది. రెండు కంపెనీలు బీబీకే ఎలక్ట్రానిక్స్ కిందకు వచ్చినప్పటికీ తమ కార్యకలాపాలు స్వతంత్రంగా నిర్వహించుకుంటామని వన్‌ప్లస్ స్పష్టం చేసింది. 

ఈ విలీనం ద్వారా ఇరు కంపెనీలు తమ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌తోపాటు వనరులను పంచుకోవడంలో మరింత ప్రభావవంతగా ముందుకెళ్తాయని వన్‌‌ప్లస్ సీఈవో పెటె లా పేర్కొన్నారు. వన్‌ప్లస్ ఉత్పత్తులను లాంచ్ చేయడం, ఈవెంట్‌లను నిర్వహించడం, మునుపటిలాగే అదే వన్‌ప్లస్ ఛానెల్‌ల ద్వారా ఫీడ్‌బ్యాక్ కోసం మీతో (వన్‌ప్లస్ కమ్యూనిటీ) నేరుగా ఇంటరాక్ట్ అవ్వడం వంటివి ఉంటాయన్నారు. వన్‌ప్లస్ కొత్త కస్టమర్‌లను కూడా సంపాదించాలని ఈ భాగస్వామ్యం ద్వారా ఆశిస్తుందన్నారు. ఈ విలీనం మరిన్ని మంచి ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా వన్‌‌ప్లస్ యూజర్లకు మరింత మెరుగైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఇచ్చేందుకు దోహదపడుతుందని వివరించారు.