ఖుబల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌ను సప్లయ్ చేసేందుకు గెయిల్‌‌‌‌తో ఓఎన్‌‌‌‌జీసీ అగ్రిమెంట్

ఖుబల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌ను సప్లయ్ చేసేందుకు గెయిల్‌‌‌‌తో ఓఎన్‌‌‌‌జీసీ అగ్రిమెంట్
  • ఖుబల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌ను సప్లయ్ చేసేందుకు గెయిల్‌‌‌‌తో ఓఎన్‌‌‌‌జీసీ ఒప్పందం
  • 2024 లో ప్రొడక్షన్ మొదలయ్యే అవకాశం

న్యూఢిల్లీ: త్రిపురలోని ఖుబల్  గ్యాస్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ నుంచి తీసే గ్యాస్‌‌‌‌ను గెయిల్‌‌‌‌ ఇండియాకు, అస్సాం గ్యాస్ కంపెనీ (ఏజీసీఎల్‌‌‌‌)కు అమ్మేందుకు ఓఎన్‌‌‌‌జీసీ అగ్రిమెంట్‌‌‌‌ కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం, గెయిల్‌‌‌‌కు50 వేల స్టాండర్డ్‌‌‌‌ క్యూబిక్ మీటర్ గ్యాస్‌‌‌‌ను సరఫరా చేయనున్నారు. ఖుబల్‌‌‌‌ గ్యాస్ ఫీల్డ్‌‌‌‌  ప్రొడక్షన్ స్టార్టయితే ఓఎన్‌‌‌‌జీసీకి త్రిపురలో ఇది 10 వ గ్యాస్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ అవుతుంది. ఏడాదికి 4,40,000 స్టాండర్డ్‌‌‌‌ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌‌‌‌ను  ఖుబల్ గ్యాస్ గేథరింగ్ స్టేషన్ (జీజీఎస్‌‌‌‌)  ప్రాసెస్ చేయగలదు. ‘ఓఎన్‌‌‌‌జీసీ, గెయిల్‌‌‌‌, ఏజీసీఎల్‌‌‌‌కు మాత్రమే కాకుండా నార్త్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌లోని ప్రజలకు ఇది శుభకరమైన రోజు. కొత్త ఫీల్డ్‌‌‌‌తో ఇండస్ట్రీలకు, ప్రజల ఇండ్లకు మరింత గ్యాస్ అందుబాటులో ఉంటుంది. ప్రజల జీవితాలు మెరుగవుతాయి’ అని ఓఎన్‌‌‌‌జీసీ త్రిపుర అసెట్ మేనేజర్‌‌‌‌‌‌‌‌ తరుణ్ మాలిక్ పేర్కొన్నారు. తాజా అగ్రిమెంట్‌‌‌‌తో  గెయిల్‌‌‌‌, ఓఎన్‌‌‌‌జీసీ మధ్య సంబంధం మరింత  బలపడుతుందని చెప్పారు. ఖుబల్‌‌‌‌ గ్యాస్ ఫీల్డ్‌‌‌‌లో 2024 నుంచి ప్రొడక్షన్ స్టార్టవుతుందని అంచనా. నార్త్ ఈస్ట్ రీజియన్‌‌‌‌లో పెద్ద మొత్తంలో డెవలప్ చేస్తున్న గ్యాస్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ ఇంధ్ర ధనుష్‌‌‌‌ గ్యాస్ గ్రిడ్‌‌‌‌ లైన్‌‌‌‌ (ఐజీజీఎల్‌‌‌‌) కూడా  ఆ టైమ్‌‌‌‌లోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ‌‌‌‌