కోనసీమలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజ్ కలకలం సృష్టించింది. బ్లో అవుట్ తరహాలో మంటలు కూడా రావడంతో అదుపు చేసేందుకు వెళ్లిన ONGC సిబ్బంది పరుగులు తీశారు.
రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ONGC బావి వద్ద ఈరోజు ( జనవరి5) మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు చేసిన క్రమంలో గ్యాస్ పైప్ లైన్ నుంచి ఈ లీకేజ్ సంభవించింది. భారీగా గ్యాస్ బయటకు వచ్చి గ్రామంలోకి వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
గ్యాస్ లీకేజ్ అదుపు చేసేందుకు ప్రయత్నించడంలో భాగంగా భారీగా మంటలుఎగిసి పడ్డాయి. ప్రస్తుతం గ్యాస్ లీకేజ్ ఆపరేషన్ కొనసాగుతుంది.100 అడుగుల పైకి చేరడంతో వందలాది కొబ్బరిచెట్లు తగలబడుతున్నాయి. ముందస్తు జాగ్రత్‌త చర్యలా సమీపంలోని గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. సమాచాచం అందుకున్న ONGC సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
