ఏపీలో టీడీపీ నేతల గృహనిర్బంధాలు, అరెస్టులు

V6 Velugu Posted on Oct 20, 2021

ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల గృహనిర్బంధాలు.. ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయం NTR భవన్ పై అల్లరిమూకల దాడికి నిరసనగా... ఆ పార్టీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో  ఏపీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను  పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. పలు చోట్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చిన నేతలను అరెస్ట్  చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ టీడీపీ నేతల నిరసనలు కొనసాగిస్తున్నారు.  రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతోందన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా. జగన్ సర్కారు స్వేచ్ఛను హరిస్తోందన్నారు. పోలీసులు వైసీపీ తొత్తులుగా మారారని మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర బంద్ పిలుపుతో.. గొల్లపూడి వన్ టౌన్ సెంటర్ లో  నిరసన తెలిపేందుకు వచ్చిన దేవినేని ఉమను అరెస్ట్ చేశారు పోలీసులు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు దేవినేని ఉమా. 
 

Tagged AP, arrests, TDP leaders,

Latest Videos

Subscribe Now

More News