ఏపీలో కరోనా డేంజర్: ఇవాళ కూడా 20 వేలు దాటిన కేసులు

 ఏపీలో కరోనా డేంజర్: ఇవాళ కూడా 20 వేలు దాటిన కేసులు

అమరావతి: ఏపీలో కరోనా వైరస్ విస్తరణ కొనసాగుతోంది. గత ఐదు రోజులు గా 20 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. శుక్రవారం కాస్త తగ్గినట్లే కనిపించినా శనివారం మళ్లీ 20 వేల మార్కు దాటింది. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షా 10 వేల 571 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 20 వేల 65 మందికి కరోనా నిర్ధారణ అయింది. అలాగే ఇవాళ 96 మంది కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మంది చనిపోగా విశాఖ జిల్లాలో 12 మంది, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో పది మంది చొప్పున, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున, చిత్తూరులో ఆరుగురు, కడపలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు చొప్పున చనిపోయారు. అలాగే గడచిన 24 గంటల్లో 19 వేల 272మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.