ఏపీలో కొనసాగుతున్న పంచాయతీ ఓట్ల లెక్కింపు

ఏపీలో కొనసాగుతున్న పంచాయతీ ఓట్ల లెక్కింపు
  • మేజర్ పంచాయతీల్లో తెల్లవారుజాము వరకు కౌంటింగ్ కొనసాగే అవకాశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తక్కువ ఓట్లు ఉన్న చిన్న పంచాయతీల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. రెండు వేలకు పైగా ఓట్లున్న పెద్ద గ్రామ పంచాయతీలు, మేజర్ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు నిదానంగా కొనసాగుతోంది. మూడు విడుత ఎన్నికల్లో 81.7 శాతం పోలింగ్ నమోదు కాగా..  నాలుగో విడుత పోలింగ్ లో మొత్తం 82.5 శాతం ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. గడచిన మూడు విడతల్లో జరిగిన పోలింగ్ నేపధ్యంలో ఈసారి పోలింగ్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఈసారి కూడా  ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి చాలా సమయం పడుతోంది. టీడీపీ-వైసీపీలతోపాటు.. బీజేపీ మద్దతుతో జనసేన కూడా గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల్లో బరిలోకి దిగడంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య భారీగా పోలింగ్ నమోదు అయింది. పలు చోట్ల ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడం.. ప్రత్యర్థి ఏజెంట్లపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు.. కొన్ని చోట్ల్ తెల్లవారుజాము వరకు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు, 161 మండలాల పరిధిలో పోలింగ్‌ జరిగింది. 3,299 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2197 స్థానాల్లో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 47 వేల 459 మంది వార్డు మెంబర్లుగా ఎలాంటి పోటీ లేకుండా గెలుపొందారు. మొత్తం 2.26 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.

For More News..

కార్పొరేట్  కాలేజీలు మూసేసేదాకా పోరాడదాం

తెలుగు రాష్ట్రాల సీఎంలకు మాతృభాషపై ప్రేమ లేదు

శ్రీశైల మల్లన్న పాదయాత్ర భక్తులకు ఏర్పాట్లు