జూరాల వద్ద 30 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

జూరాల వద్ద 30 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

స్వల్పంగా తగ్గిన వరద పోటు

ఆల్మట్టి నుండి 3 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో

మహబూబ్ నగర్: కృష్ణా నదిలో వరద పోటు కాస్త తగ్గుముఖం పట్టింది. నిన్నటితో పోల్చితే  సుమారు 30 వేల క్యూసెక్కుల వరద తగ్గింది. దీంతో జూరాల డ్యామ్ వద్ద అధికారులు 9 గేట్లు మూసివేశారు. మొత్తం 30 గేట్ల ద్వారా 2 లక్షల 74 వేల క్యూసెక్కులు దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం జరాల డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 2 లక్షల 98 వేల క్యూసెక్కులు ఉండగా..  విద్యుత్ ఉత్పత్తితోపాటు 30 గేట్ల ద్వరా మొత్తం 2 లక్షల 74 వేల క్యూసెక్కులు  విడుదల చేస్తున్నారు. జూరాల డ్యామ్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. 7.798 టీఎంసీల నీటిని నిల్వ చేస్తూ.. వచ్చిన వరదను వస్తున్నట్లే  దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 317.760మీటర్లు ఉంది. ఎగువ , దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో  విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.