
శ్రీవాణి ట్రస్టు దాతల సౌకర్యార్థం సెప్టెంబరు నెలలో ప్రతిరోజూ 100 ఆన్‌లైన్ బ్రేక్ దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచినట్లు టీటీడీ తెలిపింది. ఇందులో భాగంగా దాతలు శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.10 వేలు ఆన్‌లైన్‌లో లేదా తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో కరెంటు బుకింగ్ ద్వారా చెల్లించి ఉదయం బ్రేక్ దర్శనం టికెట్లు పొందవచ్చు. కాగా.. సెప్టెంబరు 19న శ్రీవారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం మరియు సెప్టెంబరు 23న గరుడసేవ ఉన్న కారణంగా ఈ రెండు రోజుల పాటు టికెట్లను టీటీడీ రద్దు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. దాతల విజ్ఞప్తి మేరకు జూలై 30 నుండి శ్రీవాణి ట్రస్టు దాతల దర్శన కాలాన్ని సంవత్సరంపాటు పొడిగించారు. గతంలో శ్రీవాణి ట్రస్ట్ దాతలకు కేవలం ఆరు నెలల పాటు మాత్రమే దర్శనానికి అనుమతించేవారు.
For More News..