
- పేట్‌బషీరాబాద్ పోలీసులు
జీడిమెట్ల, వెలుగు: ఆన్లైన్ ద్వారా డబ్బులు తీసుకుని క్యాష్ రూపంలో ఇస్తానని మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన మనీషా సావంత్, ఛత్తీస్ ఘడ్కు చెందిన కుంజురామ్పటేల్వ్యాపార భాగస్వాములు. ఇటీవల కుంజురామ్కు మనీషా సావంత్ ఆన్లైన్లో రూ.18.5 లక్షలు చెల్లించింది. తిరిగి డబ్బుల గురించి అడగడంతో తన వద్ద నగదు ఉందని హైదరాబాద్‌లో కలిసి ఇస్తానని నమ్మబలికాడు.
నగదు తీసుకోవడానికి పేట్‌బషీరాబాద్‌లోని ప్యాంటాలూమ్ షాప్ వద్దకు రమ్మనాడు. అక్కడికి వచ్చిన ఆమెకు చిన్నపిల్లలు ఆడుకునే డబ్బులు ఇవ్వడంతో గమనించి ప్రశ్నించింది. దీంతో కుంజు రామ్పటేల్తోపాటు అతని వెంట ఉన్న ఇద్దరు పారిపోయారు. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో ముగ్గురిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.