ఇంటర్​లో ఆన్​లైన్ కంప్లైంట్స్ విభాగం

ఇంటర్​లో ఆన్​లైన్ కంప్లైంట్స్ విభాగం

హైదరాబాద్​,వెలుగు: ఇంటర్మీడియేట్ విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం ఆన్ లైన్  ఫిర్యాదుల విభాగాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. మంగళవారం  ప్రభుత్వ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఇంటర్​ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్​తో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్​ఈ విభాగాన్ని  ప్రారంభించారు.  విద్యార్థులు  ఎక్కడి నుంచైనా ఆన్​లైన్​ద్వారా  ఫిర్యాదు చేయవచ్చని సోమేశ్​కుమార్​ తెలిపారు.  బోర్డు ఆఫ్ ఇంటర్మీడియేట్ గ్రీవియెన్స్ రిడ్రెసల్​ సిస్టమ్(బిగ్ఆర్ఎస్) పేరుతో ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని,  తమ ఫిర్యాదుల స్టేటస్​ను  సెల్​ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు.   ‘బిగ్​ఆర్సీ’ పేరుతో ఒకటీ, రెండు రోజుల్లో   యాప్​ రానుందని,  వారం రోజుల్లో తెలుగు  వెబ్ సైట్​ప్రారంభిస్తామన్నారు.

ఇంటర్​ పరీక్షల నిర్వహణపై త్రిమెన్ కమిటీ ఇచ్చిన ఆరు సిఫారసులనూ అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఈసారి పరీక్షల్లో ఒక్క తప్పు జరగడానికి వీలు లేదన్నారు.  పరీక్షల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.  త్వరలోనే ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్, జీమెయిల్​ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉమర్ జలీల్​ తెలిపారు. కార్యక్రమంలో సీజీజీ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే, ఇంటర్ బోర్డు అధికారులు జయప్రదబాయి, రాణి, సుశీల్​కుమార్, లక్ష్మారెడ్డి, ఖలిక్ తదితరులు పాల్గొన్నారు.