అగ్రి వర్సిటీలో ఆన్ లైన్ కోర్సులు స్టార్ట్‌

అగ్రి వర్సిటీలో ఆన్ లైన్ కోర్సులు స్టార్ట్‌

హైదరాబాద్, వెలుగు: రాజేంద్రనగర్‌‌లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రివర్సిటీలో ‘ఇన్ఫర్మేషన్, హ్యాండ్లింగ్, స్కిల్ ఫర్ టీచింగ్, లెర్నింగ్ అండ్ రీసెర్చ్’పై నిర్వహిస్తున్న వర్చువల్ ఆన్ లైన్ కోర్సులు స్టార్ట్‌ అయ్యాయి. జాతీయ వ్యవసాయ ఉన్నత విద్య పథకంలో భాగంగా మూడు రోజులు జరిగే కోర్సులను అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ ఎడ్యుకేషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌‌ ఆర్తి అగర్వాల్‌ ప్రారంభించి మాట్లాడారు.నాలెడ్జ్ మేనేజ్ మెంట్ తోనే ఫ్యూచర్ ఉంటుందని, ఆన్ లైన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్ ను వాడుకోవాలని చెప్పారు. ఈ నెల 26వ తేదీ నుంచి మూడు వారాలపాటు ఆన్ లైన్‌ క్లాసులు జరుగుతాయని, స్టూడెంట్లు గమనించాలని అగ్రకల్చరల్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్ లర్‌‌ పి.ప్రవీణ్‌ రావ్ అన్నారు.