సైబర్ నేరాలు..ఇప్పుడు ఈ మాట వింటేనే జనం వణికిపోతున్నారు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగించని వారు లేరు.. ఏ పని చేయాలన్నా సెల్ ఫోన్ లేకుండా జరగడం లేదు. కరెంట్ బిల్, ఫోన్ బిల్, రీచార్జ్, యూపీఐ చెల్లింపులు, బ్యాంకులావా దేవీలు ఇలా అన్ని పనుల్లో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ లేకుండా చేయలేని పరిస్థితి.. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ నేరాగాళ్లు రెచ్చిపోతున్నారు. యూజర్ల బలహీనతలను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు వారి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఆర్టీసీ ఉద్యోగినికి ఫెడెక్స్ కొరియర్ పేరుతో ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆమెను దోచుకునేందుకు ప్రయత్నించారు. మోసం అని తెలుసు కున్న ఆమె..కాల్ కట్ చేసి..విషయాన్ని టీజీఎస్ ఎండీ సజ్జనార్ కు విషయం తెలియజేయడంతో నేరాగాళ్లు బండారం బయటపడింది. దీనికి సంబంధించిన పోస్ట్ ను సజ్జనార్ X లో షేర్ చేశారు.
#FedEx courier cyber frauds are increasing!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 12, 2024
Recently, a #TGSRTC woman employee had received a call. Where a person introduced himself as a customs inspector in Delhi airport. During the conversation he threatened her that she booked a courier, which contained 1.40 grams of MDMA,… pic.twitter.com/5Ee5KIPTPH
విషయానికి వస్తే.. హైదరాబాద్ కు చెందిన TGSRTC మహిళా ఉద్యోగికి ఫోన్ చేసి సైబర్ నేరగాళ్లు భయభ్రాంతులకు గురిచేశారు. మలేషియాకు చెందిన ఒకరికి ఆమె కొరియర్‌ను బుక్ చేశారని, అందులో 1.40 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 16 ఫేక్ పాస్ పోర్టులు, 58 డెబిట్ కార్డులున్నాయంటూ న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారి నంటూ ఇటీవల కాల్ చేశారు. కొరియర్ లో నిషేధిత డ్రగ్స్ ఉన్నందున తనపై కేసు నమోదైందని బెదిరించాడు. మీరు విచారణకు ఢిల్లీకి తప్పకుండా రావాల్సిం దేనని భయపెట్టారు.
ALSO READ | డోంట్ వర్రీ : ఈ 500 రూపాయల నోట్లు చెల్లుతాయి.. నకిలీ కాదు..!
అంతటితో ఆగకుండా పోలీసులంటూ బెదిరించి స్పైప్ వీడియో కాల్ లో పాల్గొనేలా చేశారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే, తాము అడిగినంత ఇవ్వాలని చెప్పా రు. ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ ఖాతాల వివరాలు అడగడంతో ఆమెకు అనుమానం వచ్చింది. మోసమని గుర్తించి వారితో గొడవకు దిగి స్కైప్ వీడియో కాల్ నుంచి బయ టకు వచ్చారు. వెంటనే ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు.
ఇలా తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మందికి సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి.. మోసాలు చేస్తున్నారు. అనుమానస్పదంగా అనిపించే ఫోన్ కాల్స్‌కు మీరు స్పందిం చొద్దు. వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దు. ఒకవేళ సైబర్ మోసాల్లో చిక్కుకున్నామని ఏమాత్రం అనుమానం వచ్చిన వెంటనే 1930కి కాల్ చే యండి. ఫెడెక్స్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి అని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.