రెండోసారి.. భారత్ ఇకపై రష్యానుంచి ఆయిల్ కొనదు: ట్రంప్

రెండోసారి.. భారత్ ఇకపై రష్యానుంచి ఆయిల్ కొనదు: ట్రంప్

భారత్, రష్యా ఆయిల్​ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు మరోసారి కామెంట్స్ చేశారు. ఇకపై భారత్.. రష్యానుంచి అయిల్​ ను కొనుగోలు చేయదని రెండోసారి అదే పాట పాడారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించి కీలకమైన ఆయుధ చర్చలు సందర్బంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. 

బుధవారం వైట్​ హౌస్​ లో  మాట్లాడిన ట్రంప్​.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు భారత్​ నిలిపివేస్తుందని.. ప్రధాని నాకు హామీ ఇచ్చారని అన్న విషయం తెలిసిందే.. అమెరికా అధ్యక్షుడి వాదనలకు ప్రతిస్పందనగా భారత్​ అలాంటిదేమీ లేదు.. ఇంధన దిగుమతులు  పూర్తిగా కస్టమర్ల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా  ఉంటాయని తెలిపింది. అయితే శుక్రవారం జెలెన్​ స్కీ తో జరిగిన సమావేశంలో కూడా  మరోసారి ఇవే మాటలు రిపీట్ చేశారు ట్రంప్.​

ఇటీవల రష్యా చమురు కొనుగోలు కారణంగా ట్రంప్ భారతదేశంపై 50 శాతం సుంకాలను విధించారు. అందులో అదనంగా 25 శాతం సుంకాలు కూడా ఉన్నాయి.