Varun Tej: తండ్రి అయ్యాక స్టైలిష్ లుక్‌లో వరుణ్ తేజ్.. కొత్త ఫోటోలకి క్రేజీ రెస్పాన్స్

Varun Tej: తండ్రి అయ్యాక స్టైలిష్ లుక్‌లో వరుణ్ తేజ్.. కొత్త ఫోటోలకి క్రేజీ రెస్పాన్స్

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌లను సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్‌‌‌‌లో ఆచితూచి అడుగులేస్తున్నాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం తన 15వ (VT15) సినిమాతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. లేటెస్ట్గా తన కొత్త లుక్‌‌ను రివీల్ చేశాడు వరుణ్. ఇందులో స్టైలిష్ లుక్‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. కూలింగ్ గ్లాసెస్, లాంగ్ హెయిర్‌‌‌‌తో ఉన్న తన నయా లుక్ ఆకట్టుకుంది.

ఇండో కొరియన్ హారర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫారిన్‌‌లో జరుగుతోంది. మోస్ట్ ఎంటర్‌‌‌‌టైనింగ్ అండ్ హై ఎనర్జీ సీక్వెన్స్‌‌లను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌‌తో ఎనభై శాతం షూటింగ్ పూర్తవుతుంది. త్వరలోనే టైటిల్‌‌ అనౌన్స్‌‌ చేయడంతోపాటు మూవీ గ్లింప్స్‌‌ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు.  

యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. రితికా నాయక్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. సత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమన్‌‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ‘కొరియన్‌‌ కనకరాజు’ అనే టైటిల్‌‌ను  పరిశీలిస్తున్నారు.

ఇకపోతే.. తండ్రి అయ్యాక వరుణ్ చాలా స్టైలిష్గా మారడంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. గత నెలలో 2025 సెప్టెంబర్ 10న వరుణ్-హీరోయిన్ లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులయ్యారు. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య పండంటి మగబిడ్డకు జన్మినిచ్చింది. ఇలా కుమారుడి రాకతో.. వరుణ్కి రానున్నవన్నీ విజయాలే అని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

అయితే, వరుణ్ తేజ్.. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ను ఎంచుకుంటూ వస్తోన్న, విజయానికి చాలా దూరంలో ఉన్నాడు. గత నాలుగు సినిమాలు గని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, ఇటీవలే మట్కా. ఇవన్నీ వరుణ్కు ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వలేకపోయాయి.

బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టాలనే సంకల్పంతోనే ఈ ప్రాజెక్ట్స్ చేసినప్పటికీ.. సరైన హిట్ ఒక్కటే అంటే ఒక్కటి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే 'కుమారుడి రాక.. తండ్రికి విజయోస్తు' అని సరదా పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.