లోన్ యాప్ వేధింపులకు సింగరేణి కార్మికుడు బలి

లోన్ యాప్ వేధింపులకు సింగరేణి కార్మికుడు బలి

లోన్ యాప్ ఆ పేరు వింటేనే జనాల గుండెల్లో వణుకు పుడుతుంది. తీసుకున్న అప్పు ఎప్పుడు చెల్లిస్తారంటూ.. పీకల మీద కత్తి పెట్టినట్లు వేధిస్తుంటారు లోన్ నిర్వహకులు. ఫోన్ ముట్టుకుంటే చాలు ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఫోన్లు, మెసేజ్ లతో మోత మొగిస్తుంటారు. తాజాగా లోన్ యాప్ వేధింపులతో పెద్దపల్లి జిల్లాలో ఓ నిండు ప్రాణం బలైయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి రోడ్డు దగ్గర నివాసముంటున్న పల్లె వంశీకృష్ణ(27) అనే యువకుడు సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. వంశీకృష్ణ గతంలో ఆన్ లైన్ లోన్ యాప్ ద్వారా3 లక్షల అప్పు తీసుకున్నాడు. అయితే దాన్ని వాయిదా పద్దతిలో ఇదివరకే చెల్లించాడు. రుణం మొత్తం చెల్లించినా కానీ మరలా 3 లక్షలను చెల్లించాలంటూ.. ప్రతిరోజు ఫోన్ లు చేసేవారు నిర్వహకులు. 

దీంతో లోన్ యాప్ పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేక వంశీకృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.