గ్రామ పంచాయతీల్లో ఆన్ లైన్ విధానం

గ్రామ పంచాయతీల్లో ఆన్ లైన్ విధానం

రాష్ట్రవ్యా ప్తంగా గ్రామ పంచాయతీల్లో ఆన్ లైన్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్న రికార్డుల విధానానికి స్వస్తి పలకాలని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆన్ లైన్ వ్యవస్థ ఉంది. పంచాయతీరాజ్ శాఖలోనూ జవాబుదారీతనం, పారదర్శక త కోసం ఆన్ లై న్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఇటీవల అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో సమావేశమై ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గతేడాది కొత్తగా ఏర్పాటైన 4,380 పంచాయతీలు కలిపి మొత్తంగా 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

కంప్యూటర్ల కొరత
రాష్ట్రంలో ప్రస్తుతం 12,751 గ్రామ పంచాయతీలుఉన్నాయి. ఆన్ లైన్ వ్యవస్థ అమలు చేసేందుకు అన్ని పంచాయతీల్లో సదుపాయాలు లేవు. మొత్తంగా 5,600 చోట్ల కంప్యూటర్లు ఉన్నట్టు పంచాయతీ రాజ్ అధికారులు చెబుతున్నారు. గతంలో గ్రామ పంచాయతీలను క్లస్టర్లు గా విభజించారు. రెండు, మూడు చిన్న పంచాయతీలను కలిపి వాటిని ఏర్పాటు చేశారు. ఆయా చోట్ల పంచాయతీ కార్యదర్శులు క్లస్టర్​ పరిధిలో కంప్యూటర్ ఉన్న పంచాయతీలకు వెళ్లాలి, లేదా మండల కేం ద్రాలకు వెళ్లి ఆన్ లైన్ రికార్డుల నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

చాలా మంది కొత్త వాళ్లే..
రాష్ట్రంలో ప్రస్తుతమున్న పంచాయతీ కార్యదర్శుల్లో మూడింట రెండొంతుల మంది కొత్త వారే. గత నెలలోనే రాష్ట్రవ్యా ప్తంగా 8,500 మంది పంచాయతీ కార్యదర్శులు నియమితులయ్యారు. చాలా మందికి గ్రామాల గురించి , కార్యదర్శి విధులు, బాధ్యతల గురించి పెద్దగా తెలియదు. వారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోం ది. తాజాగా ఆన్ లైన్ విధానానికి సంబంధించి చాలాచోట్ల డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సాఫ్ట్ వేర్ నిపుణులతో కార్యదర్శులకు శిక్షణ ఇప్పిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

కార్యదర్శులకు గ్రేడింగ్..
రాష్ట్రవ్యా ప్తంగా పంచాయతీ కార్యదర్శుల పనితీరును అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు వారికి గ్రేడ్ లు ఇస్తున్నారు. కొత్త కార్యదర్శులను ప్రభుత్వం మూడేళ్ల కాం ట్రాక్టు పద్ధతిన నియమిం చింది. ఏటా పనితీరు ఆధారంగా తర్వాతి ఏడాదికి వారిని పొడిగించనున్నారు.

రికార్డులకు దశలవారీగా స్వస్తి
ఎన్నో ఏళ్లుగా పంచాయతీల్లో మ్యాన్యు వల్​ రికార్డుల వ్యవస్థే కొనసాగుతోంది. ఈ ప్రక్రియకు గుడ్ బై చెప్పాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒకేసారి చేయటం సాధ్యం కానందున దశల వారీగా రికార్డులను కంప్యూటర్లలో అప్ లోడ్ చేయాలని, తర్వాత మ్యాన్యు వల్​ రికార్డుల ప్రక్రియకు ముగింపు పలకాలని యోచిస్తున్నారు. అయితే పంచాయతీలు అధికంగా ఉండటం, చాలా చోట్ల కార్యదర్శులు కాం ట్రాక్టుపై నియమితులైన వారు కావడంతో ఆన్ లైన్ వ్యవస్థ అమలు సజావుగా జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆన్ లై న్ లో ఏమేం పనులు?
ఆన్ లై న్ కు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాల్సిన చర్యలు, పంపాల్సిన నివేదికలను ఉన్నతాధికారులు ఖరారు చేశారు.

ప్రతి నెలా గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించి , వాటిలో ఆమోదించి న తీర్మానాలను, సమావేశం ఫొటోలను ఆన్ లై న్ లో
అప్​లోడ్ చేయాలి.

రెం డు నెలలకోసారి నిర్వహించే గ్రామ సభ సమావేశ వివరాలు, ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ చేయాలి.

పంచాయతీలో ఖర్చు చేసిన నిధుల వివరాలు, చేపట్టిన తనిఖీల వివరాలను, ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన (పీఎంఏజీవై ) క్రింద ఎంపికైన పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు, నిధులు కేటాయించాక అభివృద్ధి పనుల ప్లాన్ లను పంపాలి.

లే ఔట్లు, భవనాల నిర్మాణ అనుమతులు, మ్యుటేషన్లు, వ్యాపా ర లైసెన్సుల కోసం ఆన్ లై న్ ద్వారా అప్లై చేసుకునేలా ఏర్పాట్లు
చేయాలి.

హరితహారంలో భాగంగా నర్సరీల ఏర్పాటు, మొక్కల పెం పకం, మొక్కలు నాటడానికి సిద్ధం చేసిన ప్రణాళికను అప్ లోడ్ చేయాలి.

ఏటా విధిగా పంచాయతీ లెక్కలు ఆడిట్ చేసి, వివరాలను పంచాయతీరాజ్ కమిషనరేట్ కు పంపాలి.

ఈ వివరాలను ఆన్ లై న్ చేయకపోతే గ్రామ కార్యదర్శి , సర్పంచ్ లపై చర్యలు తీసుకుంటారు.