22 మంది డాక్టర్లు.. విధుల్లో ఐదుగురే : తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్

22 మంది డాక్టర్లు.. విధుల్లో ఐదుగురే : తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్

జోగిపేట, వెలుగు: తెలంగాణ వైద్యవిధాన పరిషత్(టీవీవీపీ) కమిషనర్​ అజయ్​కుమార్​ బుధవారం జోగిపేట 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం 22 మంది డాక్టర్లకు గానూ ఐదుగురే డ్యూటీలో ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రిజిస్టర్​లో వారికి ఆబ్సెంట్ రాశారు. గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకుంటానన్నారు. హాస్పిటల్​లోని వార్డులన్నీ తిరిగి చూశారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని సూచించారు. మరోసారి ఇలా చేస్తే సీరియస్​యాక్షన్​ ఉంటుందని హెచ్చరించారు.