-తెలంగాణలో 5 జలాశయాలే కాలుష్య రహితం : మంత్రి కీర్తి వర్ధన్‌‌ సింగ్‌‌

-తెలంగాణలో 5 జలాశయాలే  కాలుష్య రహితం :  మంత్రి కీర్తి వర్ధన్‌‌ సింగ్‌‌
  • కేంద్రమంత్రి కీర్తి వర్ధన్‌‌ సింగ్‌‌ వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు:  తెలంగాణలోని సరస్సులు, చెరువులు, ట్యాంకుల్లో ఐదు జలాశయాలు మాత్రమే ప్రాథమిక జల నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నట్లు (కాలుష్య రహితంగా) గుర్తించామని కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ప్రమాణాలు పాటించే జలాశయాల సంఖ్య 158 మాత్రమే ఉన్నాయంది. 

జల నాణ్యత ప్రమాణాల ప్రకారం.. 2023 నాటికి ఈ జలాశయాలను గుర్తించినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌‌ సింగ్‌‌ వెల్లడించారు. కేంద్ర పీసీబీ జాతీయ జల నాణ్యత పర్యవేక్షణ కార్యక్రమం కింద తెలంగాణలో 273 కేంద్రాలతో సహా దేశవ్యాప్తంగా 4,922 ప్రాంతాల్లో జల వనరులను పర్యవేక్షిస్తోందని లోక్ సభలో ఎంపీ రఘువీర్ రెడ్డి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.