కేసీఆర్ పదేళ్ల పాలనలో కాంట్రాక్టర్లు మాత్రమే బాగుపడ్డారు : వివేక్ వెంకటస్వామి

కేసీఆర్ పదేళ్ల పాలనలో కాంట్రాక్టర్లు మాత్రమే బాగుపడ్డారు : వివేక్ వెంకటస్వామి

మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ పదేళ్ల పాలనలో కాంట్రాక్టర్లు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు. ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదన్నారు. రూ.45 వేల కోట్ల రూపాయలు మిషిన్ భగీరథ పథకానికి ఖర్చు చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ స్కీంతో ఒక్క బొట్టు నీళ్లు కూడా రాలేదని చెప్పారు. మంచిర్యాల జిల్లా జైపూర్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలోకాంగ్రెస్ లో చేరారు. 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలందరికీ పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను వివరించాలన్నారు.  ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారని అన్నారు. కాంట్రాక్టర్ లతో లబ్ధిపొందిన కాంట్రాక్టర్లు కేసీఆర్ కు ఎలక్టోరల్ బాండ్ల పేరుతో రూ.500 ఇచ్చారని తెలిపారు.

 కేసీఆర్ రాత్రి పుస్తకాలు చదివి ప్రాజెక్టులు కట్టారని రైతులను నిండా ముంచిండని విమర్శించారు.ఒక్క ఎకరాకు కూడా సాగు నీరు అందలేదని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ధనికుడు కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ అని విమర్శించార. చెన్నూరు నియోజకవర్గంలో మిషన్ భగీరథ పైప్ లైన్లు వేయడంతో రోడ్లన్నీ నాశనం అయ్యాయని తెలిపారు. గడ్డం వంశీని ఎంపీగా గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి చెందుతుందని అన్నారు.