
ఆధార్ కార్డులో మీ పేరు, అడ్రస్, పుట్టిన తేదీని మార్చాలని, నవీకరించాలని చూస్తున్నారా.. అయితే ఇదే సరైన సమయం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఉడాయ్) జూన్ 14 వరకు ఆన్లైన్ పోర్టల్‌లో ఈ సేవను ఉచితంగా అందిస్తోంది. ఇండియన్స్ ఎలాంటి ఖర్చు లేకుండా ఆధార్ అప్ డేట్ చేయాలనే ఈ సేవను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రిజిస్టర్ ఆధార్‌కేంద్రాల వద్ద కూడా ఇదివరకులాగే ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. కానీ దానికి రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
ఇలా అప్డేట్ చేయండి..
ఆధార్ ఐడీ 10 ఏళ్ల క్రితం పొందినట్లైతే, ఆధార్ లింక్ చేసిన సమాచారాన్ని అప్డేట్ చేయడానికి పలు డాక్యుమెంట్లను పోర్టల్‌లో అప్డేట్ చేయాలి. అది ఎలాగంటే..
1.myAadhaar పోర్టల్లోకి లాగిన్ చేయండి. తరువాత కిందకి స్క్రోల్ చేసి డాక్యుమెంట్అప్డేట్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. ఇందు కోసం మీ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ ఫోన్‌నంబర్ అవసరం.
2. అప్పటికే ఉన్న వివరాలను ఓకే చేసి, తరువాత హైపర్‌లింక్‌పై క్లిక్చేయాలి.
3. ప్రుఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రుఫ్ ఆఫ్ అడ్రస్ని సెలెక్ట్ చేసి వెంటనే స్కాన్ చేసిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. కావాల్సిన డాక్యుమెంట్ల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
4. అప్డేట్ ప్రాసెస్ ఏ స్టేజ్‌లో ఉందో తెలిసేందుకు 14 అంకెల అప్డేట్ రిక్వస్ట్ నంబర్వస్తుంది.
5. సమాచారం అప్డేట్ అయ్యాక, కొత్త ఆధార్ కార్డు జనరేట్ అవుతుంది.
ఇంకో ఆరు రోజుల సమయమే ఉన్నందునా త్వరగా ఆధార్ నవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.