
సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫాంటసీ చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్స్. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఆదివారం సందీప్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను రామానాయుడు స్టూడియోలో చండీయాగం చేసి రిలీజ్ చేశారు. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఉన్న గరుడ పురాణంలోని నాలుగు పేజీలు కనిపించకుండా పోయాయని వివరించే పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో టీజర్ స్టార్ట్ అవడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘తొలిసారి యాగం చేసి టీజర్ రిలీజ్ చేయడం పాజిటివ్‌గా ఉంది. మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కూడా అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది. ఇలాంటి ఫాంటసీ అడ్వెంచర్ సినిమాలు నాకు పర్సనల్‌గా చాలా ఇష్టం’ అన్నాడు. త్వరలోనే మరింత ఎక్సైటింగ్ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాం అంది కావ్య థాపర్. ‘‘టైగర్’ తర్వాత సందీప్‌తో చేస్తోన్న రెండో సినిమా ఇది. ఇదొక యూనిక్ కాన్సెప్ట్. సూపర్ నేచురల్ ఫాంటసీ ఎలిమెంట్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది’ అని చెప్పాడు విఐ ఆనంద్. సందీప్‌కి ఇది మెమరబుల్ మూవీ అవుతుందన్నారు నిర్మాతలు అనిల్ సుంకర, రాజేష్ దండా.