సిద్దిపేట వెల్‌‌నెస్‌‌ సెంటర్లో మరో 8 విభాగాల్లో ఓపీ సేవలు

సిద్దిపేట  వెల్‌‌నెస్‌‌ సెంటర్లో  మరో 8 విభాగాల్లో ఓపీ సేవలు
  •     వెల్‌‌నెస్‌‌ సెంటర్‌‌ నోడల్‌‌ ఆఫీసర్‌‌ డాక్టర్‌‌ సంగీత

సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రభుత్వ, విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్య సేవలందిస్తున్న వెల్‌‌నెస్‌‌ సెంటర్‌‌లో మరో 8 విభాగాల్లో ఓపీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్‌‌నెస్‌‌ సెంటర్‌‌ ఇన్​చార్జి డాక్టర్‌‌ సంగీత తెలిపారు. శుక్రవారం సిద్దిపేట వెల్‌‌నెస్‌‌ సెంటర్‌‌ను సందర్శించిన ఆమె సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెల్‌‌నెస్‌‌ సెంటర్‌‌ ప్రస్తుతం డీఎంఈ  పర్యవేక్షణలో కొనసాగుతుందని, వెల్‌‌నెస్‌‌ సెంటర్‌‌లో కొనసాగుతున్న జనరల్‌‌ మెడిసిన్, ఫిజియోథెరపీతో పాటు ఆర్థో, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, గైనిక్, ఈఎన్‌‌టీ విభాగాల్లో ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 

వెల్‌‌నెస్‌‌ సెంటర్‌‌ సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, అవసరమైన వారి నుంచి బ్లడ్‌‌ శాంపిల్స్‌‌ సేకరించి టీ హబ్‌‌కు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో సీఎస్‌‌ ఆర్‌‌ఎంఓ డాక్టర్‌‌ జ్యోతి, డాక్టర్లు చందర్, సురేష్‌‌బాబు, సదానందం, సిబ్బంది పాల్గొన్నారు.