
బజార్ హత్నూర్, వెలుగు: ఓపెన్ స్కూల్ ప్రవేశాల కోసం బజార్హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో దరఖాస్తులు చేసుకోవాలని హెచ్ఎం భూమన్న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టెన్త్ ఫెయిలైన స్టూడెంట్లు, ఆర్థిక పరిస్థితులు బాగాలేక, ఇతర కారణాలతో చదువు మానేసి పనులు చేసుకుంటూ జీవిస్తున్న 14 ఏళ్లు పైబడిన వారు ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్ పరీక్షకు అప్లై చేసుకోవచ్చన్నారు. ఇందుకు కనీసం ఐదో తరగతి చదివి ఉండాలని, ఇతర వివరాలకు 9182771246 నంబర్‌ను సంప్రదించ వచ్చని తెలిపారు.