సాధారణంగా కారు, బస్సు, లారీ వంటి వాహనాలను స్టీరింగ్ ఆధారంగా నడుపుతారు. కానీ ఎన్‌ఐటీ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ రూపొందించిన వెహికల్‌కు మాత్రం అసలు స్టీరింగే అవసరం లేదు. వెహికల్‌ను ఆన్ చేశాక.. చేతి వేళ్లకు అమర్చుకున్న సెన్సార్ల ఆధారంగా వెహికల్ కదులుతుంది. ఐదు వేళ్లు చూపితే ముందుకు, రెండు వేళ్లు చూపితే రివర్స్ వెళ్తుంది. మూడు వేళ్లు చూపితే ఎడమ వైపు, నాలుగు వేళ్లు చూపితే కుడివైపు తిరుగుతుంది. అలాగే పిడికిలి బిగిస్తే బ్రేక్ వేసుకొని ఆగిపోయేలా రూపొందించిన టెక్నాలజీ అందరినీ ఆకట్టుకుంది.
