డెడ్‌‌‌‌లైన్‌‌‌లోగా ఆపరేషన్‌‌‌‌ కగార్‌‌‌‌ పూర్తి.. 31 మంది మావోయిస్టులు చనిపోయారు

డెడ్‌‌‌‌లైన్‌‌‌లోగా ఆపరేషన్‌‌‌‌ కగార్‌‌‌‌ పూర్తి.. 31 మంది మావోయిస్టులు చనిపోయారు

భద్రాచలం, వెలుగు: చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ దండకారణ్యంలో ప్రారంభించిన ఆపరేషన్‌‌‌‌ కగార్‌‌‌‌ను డెడ్‌‌‌‌లైన్‌‌‌‌లోగా పూర్తి చేస్తామని ఆ రాష్ట్ర డీజీపీ అరుణ్‌‌‌‌ దేవ్‌‌‌‌ గౌతమ్‌‌‌‌, సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌ డీజీ జీపీ సిన్హా వెల్లడించారు. 2026 మార్చి 31 నాటికి రాష్ట్రాన్ని నక్సల్స్‌ విముక్తి ప్రాంతంగా ప్రకటిస్తామన్నారు. బుధవారం వారు బీజాపూర్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్‌‌‌‌ 21 నుంచి మే 11 వరకు జరిపిన ఆపరేషన్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌లో 31 మంది మావోయిస్టులు చనిపోగా, అందులో 17 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారన్నారు. వీరిపై మొత్తం రూ.1.72 కోట్ల రివార్డు ఉందని తెలిపారు.

కర్రెగుట్టల్లో 214కు పైగా బంకర్లను, నాలుగు ఆయుధ తయారీ కర్మాగారాలను ధ్వంసం చేశామని చెప్పారు. మెగా స్నైపర్‌‌‌‌ గన్స్‌‌‌‌తో పాటు బీఎల్‌‌‌‌జీ సెల్స్‌‌‌‌, ఇతర పేలుడు పదార్థాలు, ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ రైఫిల్స్‌‌‌‌, ఆటోమెటిక్, సెమీ ఆటోమెటిక్‌‌‌‌ తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మావోయిస్టులు ఈ ప్రాంతాల్లో రెండేండ్లకు సరిపడా ఆయుధాలు డంప్‌‌‌‌ చేసుకున్నారన్నారు. కర్రెగుట్టలకు వెళ్లే మార్గంలో నలువైపులా మావోయిస్టులు ఐఈడీలను పెట్టగా.. 450కి పైగా ఐఈడీలను నిర్వీర్యం చేశామని, 15 ఐఈడీలు పేలిపోయాయని, కోబ్రా, డీఆర్జీలకు చెందిన 18 మంది జవాన్లు గాయపడ్డారని తెలిపారు.

ఆపరేషన్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌లో భాగంగా ఏప్రిల్​ 24న జరిగిన మొదటి ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో ముగ్గురు మహిళా మావోయిస్టులు, మే 1న ఒక మహిళా మావోయిస్టు, మే 6, -7 తేదీల్లో జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో 22 మంది మావోయిస్టులు చనిపోయారని వివరించారు. అలాగే మే 8న జరిగిన దాడిలో ఐదుగురు చనిపోయారని చెప్పారు.