ఆపరేషన్​ సింధూర్ ​విజయోత్సవ మార్చ్

ఆపరేషన్​ సింధూర్ ​విజయోత్సవ మార్చ్
భారత రక్షణ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్​సిందూర్’ సక్సెస్​కావడంతో దక్షిణ మధ్య రైల్వే సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్లాగ్​మార్చ్​నిర్వహించారు. సికింద్రాబాద్‌‌‌‌లోని రైల్ నిలయం నుంచి సంగీత్ జంక్షన్ వరకు, తిరిగి రైల్ నిలయం ఈ ఫ్లాగ్ మార్చ్ సాగింది. త్రివర్ణ పతాకాలు చేతబట్టి దక్షిణ మధ్య రైల్వే సివిల్ డిఫెన్స్ కంట్రోలర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయనాథ్ కోట్ల, స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కార్యదర్శి, దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ మెటీరియల్స్ మేనేజర్ ఎ.కె.రావత్, డిప్యూటీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఎస్.ఆర్.షెల్కే, అధికారులు, రైల్వే సిబ్బంది, స్కౌట్స్అండ్​గైడ్స్ వలంటీర్లు పాల్గొన్నారు. దారిపొడవునా భారత్​మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. రక్షణ బలగాల పరాక్రమానికి దక్షిణ మధ్య రైల్వే సెల్యూట్ చేస్తోందన్నారు.