24 పాకిస్తాన్ జెట్లను కూల్చేశాం.. డ్రోన్లతో రెచ్చగొడుతున్నారు: ఇండియన్ ఆర్మీ

24 పాకిస్తాన్ జెట్లను కూల్చేశాం.. డ్రోన్లతో రెచ్చగొడుతున్నారు: ఇండియన్ ఆర్మీ

పాకిస్తాన్ రెచ్చగొడుతూ అటాక్ చేస్తుందని   కల్నల్ సోఫియా ఖురేషి అన్నారు. పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ లతో  దాడులు చేస్తోందన్నారు. అంతే ధీటుగా పాకిస్తాన్ కు బదులిస్తున్నామని చెప్పారు.   పంజాబ్  లోని ఎయిర్ బేస్ ధ్వంసానికి పాక్ యత్నించిందన్నారు. 24 చోట్ల పాక్ జెట్లను కూల్చేశామని చెప్పారు. మే 9న రాత్రి 26 ప్రాంతాల్లో దాడులు చేసిందన్నారు. అవంతిపూర్,కుప్వారా,బారాముల్లా ప్రాంతాల్లో పాక్ కాల్పులకు బదులిచ్చామని చెప్పారు. భారత్ పూర్తిగా సంయమనంతో వ్యవహరిస్తోందని తెలిపారు.  పశ్చిమ భారత సరిహద్దులో పాక్ దాడులు చేస్తోందన్నారు ఖురేషి.

S 400 ధ్వంసం చేశారని పాక్  తప్పుడు ప్రచారం:  వ్యోమికా సింగ్

పాకిస్తాన్ కు గట్టి బదులిస్తున్నామని చెప్పారు ఆర్మీ వింగ్ కమాండర్ (IAF) వ్యోమికా సింగ్.  S 400 ను ధ్వంసం చేశామని పాక్ తప్పుడు ప్రచారం చేస్తుంది.  భారత వైమానిక దళం సరిహద్దు దాటి బదులిస్తోంది.  పంజాబ్ లోని ఎయిర్ బేస్ ను లక్ష్యంగా  చేసుకుంది. పాక్ ఫైటర్ జట్లు భారత సరిహద్దులోకి వచ్చాయి. పాకిస్తాన్ దాడుల నుంచి ఆస్తి,ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగాం. బారాముల్లా, రౌజౌరీ సెక్లార్లో కంటిన్యూగా దాడులు చేస్తోంది.ఎల్ వోసీ దగ్గర డ్రోన్లు,మిసైళ్లతో దాడులు చేస్తోంది. పాకిస్తాన్  హైస్పీడ్ మిసైళ్లను  గుర్తించాం అని అన్నారు.


జనావాసాలే పాక్ టార్గెట్ : విదేశాంగ కార్యదర్శి  విక్రమ్ మిస్రీ

సరిహద్దులోని జనావాసాలే  లక్ష్యం గాచేసుకుని పాక్ దాడులు చేస్తోంది . పాకిస్తాన్ పాల్స్ ప్రచారం చేస్తోంది.  పాకిస్తాన్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. అధంపూర్ ఆర్మీ బేస్ ధ్వంసం చేశారనేది తప్పుడు ప్రచారం. పంజాబ్,రాజస్థాన్, జమ్ముకశ్మీర్ ప్రాంతాల్లోని పౌరులే లక్ష్యంగా దాడులు చేస్తుంది.  భారత ఆర్మీ బేస్ లకు ఎక్కడా నష్టం జరగలేదు. పాక్ దాడుల్లో జమ్ముకశ్మీర్ అధికారి రాజ్ కుమార్  చనిపోయారు. పాకిస్తాన్  లోని ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే చీ కొడుతున్నారు. పాక్ దాడుల్లో ఎలాంటి డిఫెన్స్ సిస్టంలకు నష్టం కల్గలేదు అని అన్నారు.