లాడెన్ను చంపినట్టే ఆపరేషన్ సిందూర్.. టెర్రరిజంపై కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాం: ఉపరాష్ట్రపతి

లాడెన్ను చంపినట్టే ఆపరేషన్ సిందూర్.. టెర్రరిజంపై కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాం: ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌‌‌‌‌‌‌‌ను అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌‌‌‌‌‌‌‌ను అంతమొందించిన అమెరికా ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్‌‌‌‌‌‌‌‌తో పోల్చుతూ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌‌‌‌‌‌‌‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్​పై ఇండియన్ ఆర్మీ జరిపిన ఆపరేషన్ సిందూర్‌‌‌‌‌‌‌‌.. బిన్ లాడెన్‌‌‌‌‌‌‌‌ను చంపడంతో సమానమైందని వెల్లడించారు. 

భారత్ సరిహద్దులను దాటి పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిందన్నారు. శనివారం ఆయన నోయిడాలో ఉన్న జైపూరియా ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ (జేఐఎమ్)లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌‌‌‌‌‌‌‌ఖడ్ మాట్లాడుతూ.." ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్.. అంతర్జాతీయ సరిహద్దులను దాటి ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన దాడులు చేసింది. 

ఇది బిన్ లాడెన్‌‌‌‌‌‌‌‌ ను అంతమొందించిన అమెరికా ఆపరేషన్‌‌‌‌‌‌‌‌కు సమానమైన చర్య. ఈ ఆపరేషన్ ద్వారా టెర్రరిజంపై భారత్ తన కఠిన వైఖరిని చాటడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కొత్త బెంచ్ మార్కును క్రియేట్ చేసింది" అని ధన్‌‌‌‌‌‌‌‌ఖడ్ పేర్కొన్నారు.