
కామారెడ్డి టౌన్/ బాల్కొండ/: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో ఉమ్మడి జిల్లాలో విజయోత్సవాలు, ర్యాలీలు నిర్వహించాయి. ఉగ్రవాదులపై దాడి చేసి అంతమొందించడాన్ని స్వాగతిస్తూ పటాకులు కాల్చారు. జాతీయ జెండాను ప్రదర్శిస్తూ జై జవాన్.. జై భారత్ అంటూ నినదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వీహెచ్‌పీ జిల్లా ప్రెసిడెంట్ నిత్యానందం, ప్రతినిధులు వడ్ల వెంకటస్వామి, వంగ ప్రసాద్, ఆశోక్, అనిల్, రాజు తదితరుల పాల్గొన్నారు.
బాల్కొండ నేషనల్ హైవేపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ జెండా చేతపట్టి నినాదాలు చేశారు. పహల్గాం మృతులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌మండల ప్రెసిడెంట్ వెంకటేశ్‌గౌడ్, లీడర్లు యూనిస్, కట్టెల శ్రీనివాస్, విద్యాసాగర్,శ్రీనివాస్, సంజీవ్ గౌడ్,ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న -మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉగ్రవాదం అంతం కావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. నిజామాబాద్‌లోని పులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశ వేణు పూలమాలలు వేసి జవాన్లు సెల్యూట్ చేశారు. అనంతరం పటాకులు కాల్చి నినాదాలు చేశారు.