- మరో రెండు చోట్ల 28 కిలోల
- గంజాయి స్వాధీనం
ఉప్పల్/మెహిదీపట్నం/శామీర్‌పేట, వెలుగు: ఉప్పల్ పీఎస్ పరిధి గణేశ్‌నగర్ లో కిలో ఓపీఎం డ్రగ్స్ పట్టుకున్నారు. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి కథనం ప్రకారం.. రాజస్థాన్ కి చెందిన బాదర్ రామ్ అలియాస్ బహదూర్ గుర్జర్(32 ) సిటీలో టైలర్. రాజస్థాన్ నుంచి లక్ష్మణ్ మాలిక్ అనే వ్యక్తి ద్వారా ఓపీఎం తీసుకువచ్చి అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు.
మహేశ్వరం ఎస్ ఓటీ, ఉప్పల్ పోలీసులు నిఘా పెట్టి గణేశ్ నగర్ లో బాదర్రామ్ను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న కిలో ఓపీఎం విలువ రూ.5 లక్షలు ఉంటుందని చెప్పారు. కార్వాన్ టోలీ మజీద్ ప్రాంతంలోని మహమ్మద్ సలీం ఖాన్, మహమ్మద్ ఇంతియాస్ ఖాన్, వంశీకృష్ణ, సోనూ కొంతకాలంగా గంజాయి అమ్ముతున్నారు.
శుక్రవారం దాడులు చేసిన ఎక్సైజ్ ఎస్టీఎఫ్, ధూల్‌పేట ఎక్సైజ్ పోలీసులు 2.1కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్‌చేశారు. మరో ఐదుగురు పరారైనట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి, దూల్పేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మధు బాబు తెలిపారు.
మేడ్చల్ జిల్లా శామీర్ పేట పీఎస్పరిధిలోని మజీద్ పూర్ లో ఒడిశా నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్న వారిని రైడ్చేసి పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా 26 కిలోల గంజాయి దొరికింది. ఆ టైంలో కారులో ముగ్గురు మహిళలు నలుగురు పురుషులు ఉండగా అదుపులోకి తీసుకున్నారు.
