ఎంత రాత్రైనా సరే..ఇరిగేషన్పై ఇవాళే శ్వేతపత్రం రిలీజ్ చెయ్యాలి

ఎంత రాత్రైనా సరే..ఇరిగేషన్పై ఇవాళే శ్వేతపత్రం  రిలీజ్ చెయ్యాలి

ఇరిగేషన్ పై ఫిబ్రవరి 17న  శ్వేతపత్రం విడుదల చేయనుంది ప్రభుత్వం. నీటి సమస్య కాబట్టి సభను రేపటికి వాయిదా వేయాలని బీర్ల ఐలయ్య కోరారు.  అయితే ఇవాళే ఇరిగేషన్ పై శ్వేతపత్రం  విడుదల చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి.  ఇష్టం ఉన్నట్లు సభను వాయిదా వేస్తామనడం సరికాదన్నారు హరీశ్ రావు. అజెండా ప్రకారం ఇరిగేషన్ పై  ఇవాళే చర్చ జరగాలని పట్టుబట్టారు.  సడెన్ గా  మార్చడం సభా సంప్రదాయం కాదన్నారు.  

ఇవాళ ఎంతరాత్రైనా సరే ఇరిగేషన్ పై శ్వేత ప్రత్రం రిలీజ్ చేయాలని  బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్వేత పత్రం ఎందుకు రిలీజ్ చేయడం లేదు..మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ కాలేదా అని ప్రశ్నించారు. రేపు తమకు బీజేపీ జాతీయ సమావేశాలున్నాయని చెప్పారు. ఇవాళ కాకపోతే ఫిబ్రవరి 25న విడుదల చేయాలన్నారు.  సభలో అధికార,విపక్షాల మధ్య వాగ్వాదంతో అసెంబ్లీని ఫిబ్రవరి 17 ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్.

 అంతకుముందు  అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి, హరీశ్ రావు   మధ్య మాటల యుద్దం జరిగింది.  నల్గొండ సభకు వెళ్లిన కేసీఆర్..అసెంబ్లీకి రాలేరా.? సీఎంపై కేసీఆర్ వాడిన భాష సరిగా ఉందా? అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.