ప్రతిపక్షాలు ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్నాయి: ఎమ్మెల్సీ పల్లా

ప్రతిపక్షాలు ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్నాయి: ఎమ్మెల్సీ పల్లా

మున్సిపల్ ఎన్నికలు అడ్డుకోవాలని కాంగ్రెస్ ,బిజెపి పార్టీలు చూస్తున్నాయన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. కోర్ట్లు లో  కేసులు వేసి ఎన్నికలు జరగకుండా కుట్రలు చేస్తున్నాయని రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్ లో నియోజకవర్గ ఇంచార్జ్ లతో కేటిఆర్ సమావేశమయ్యారు. సమావేశం తర్వాత ఎమ్మెల్సీ పల్లా మీడియాతో మాట్లాడుతూ.. కావాలనే తమ ప్రభుత్వంపై, పాలనపై కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని, వాటన్నంటిని తిప్పి కొట్టాలని పార్టీ నేతలకు కేటీఆర్ సూచించారన్నారు. ఎన్నికలు సకాలంలో రావాలని టీఆర్ఎస్ పార్టీ కోరుతుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని వైద్య సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తోందని, ఆరోగ్య శ్రీ  పథకం ద్వారా ప్రజలకి వైద్య సేవలు అందుతున్నాయని రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల మనసులో ఉన్న ప్రభుత్వమని ఆయన అన్నారు.